టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల వ్యవహారం.. స్పందించిన చంద్రశేఖరన్
టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారంపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని అన్నారు. ఈ ఘటను తీవ్రంగా పరిగణించామని, అందుకే ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామని అన్నారు.
వాస్తవాలను నిర్ధారించడానికి, ఇందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించడానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి అనుచిత ప్రవర్తనను టాటా గ్రూప్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
కాగా, టీసీఎస్ నాసిక్ క్యాంపస్లో లైంగిక వేధింపులు, మతమార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.